అమెజాన్ అధినేతను వెనక్కినెట్టిన బిల్ గేట్స్... మళ్లీ వరల్డ్ నెంబర్ వన్

  • గతేడాది నెంబర్ వన్ గా నిలిచిన జెఫ్ బెజోస్
  • త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన అమెజాన్ షేర్లు
  • బెజోస్ కు భారీ నష్టం
  • 105.7 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో బిల్ గేట్స్
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా అవతరించారు. తాజా త్రైమాసిక ఫలితాల్లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 7 బిలియన్ డాలర్ల మేర నష్టపోయారు. అమెజాన్ షేర్ విలువ పడిపోవడం కారణంగానే బెజోస్ కు తాజా త్రైమాసికంలో భారీ నష్టాలు వాటిల్లినట్టు అర్థమవుతోంది.

ప్రస్తుతం బెజోస్ సంపద 103.9 బిలియన్ డాలర్లకు చేరడంతో ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో 105.7 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. 2018లో మినహాయించి గేట్స్ అనేక సంవత్సరాలు ప్రపంచ నెంబర్ వన్ సంపన్నుడిగా కొనసాగారు.
Go Back to Shorts
Amazon
Jeff Bezos
Microsoft
Bill Gates

More Telugu News